మా మాట
పాఠక మహాశయులకు నమస్కారం .
' అండాకారము ' గా అవతరించిన 'లింగము'నందే జగత్తు 'ఇమిడి
ఉన్నదని లింగపురాణము తెలుపుతుంది. వేదపురుషుడు అయిన పరబ్రహ్మము యొక్క సాకారరూపమే
'లింగము'అని శివపురాణము ప్రస్తుతించింది.
తనలోనే నిబిడీకృతమైన జగత్తుని ఉద్దరించాడనికే ఆ
మాహాశివుడు పన్నెండు పుణ్యక్షేత్రాలలో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా వెలిశాడు. ఈ క్షేత్రలనింటిలోను తన భక్తుల 'భక్తి
ప్రపత్తులకి సంతసించి వారి కోరిక మేరకు ' ఈ క్షేత్రాలలో జ్యోతిర్లింగాలుగా వెలిశాడు.
ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములు మహా
మహిమాన్వితములైనవి. ఈ ప్రదేశములు పరమ పవిత్రములైనవి. వీటిని దర్శించిన వారి జన్మ ధన్యము.
ఈ పన్నెండు పుణ్యక్షేత్రాలు మన పవిత్ర భారతావనిలో వివిధ
ప్రదేశాలలో ఉన్నయి. ఒకప్పుడు వీటిని దర్శించడం అత్యంత వ్యయ ప్రయాసలతో కూడినదైతే - నేడు సులభముగా
క్షేమంగా సౌకర్యవంతముగా ఈ క్షేత్రాలని దర్శించగల అవకాశాలు ఉన్నాయి.
ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శించాలని అనుకునేవారికి చక్కటి
మార్గదర్సకము అందించడానికి మేము చేస్తున్న ఈ చిరు ప్రయత్నము.
యత్రాక్లిక్ యాజమాన్యము.